రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థులకు గాయాలు

1
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థులకు గాయాలు

టీ మీడియా, మే 9, మహానంది:

మహానంది మండల పరిధిలోని గోపవరం మెట్ట సమీపంలోని మానసిక వికలాంగుల కేంద్రం వద్ద నంద్యాల నుంచి వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనంను ఢీకొన్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. అటుగా వెళ్తు ప్రమాదాన్ని గమనించిన మహానంది మండల తాసిల్దార్ జనార్ధన్ శెట్టి వారిని వేంటనే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు.

Also Read : చెత్త బుట్టలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

గాజులపల్లి గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై ఇంటర్ పరీక్షలు రాయడానికి టి. మద్దిలేటి, పావని ,మౌనిక లు వెళ్తుండగా కారు వేగంగా ఢీకొనడంతో గాయపడినట్లు తాహసిల్దార్ తెలిపారు.ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను వైసీపీ వార్డు మెంబర్లు నారాయణ,మాబువలి మరియు అక్కడి స్థానికులు కూడా సహాయ సహకారాలు అందజేసినట్లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube