రోడ్డు ప్రమాదంలోనవ వధువు మృతి*

టి మీడియా, మార్చి 11, మధిర:

0
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదంలోనవ వధువు మృతి*
టి మీడియా, మార్చి 11, మధిర:బంధువుల ఇంటికి వేడుకకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి మధిర పట్టణ శివారు రాయపట్నం సమీపంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన బలవంతపు మధు అతని భార్య సదా (24) కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం చింతల నర్వ గ్రామానికి వేడుకలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం పై భార్య భర్తలు ఇరువురు మధిర మీదుగా అంబారు పేట గ్రామానికి వెళ్లే క్రమంలో మధిర శివారు రాయపట్నం సమీపంలో దీపావళి బాంబు ల కేంద్రం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం కింద పడిపోవడంతో వెనకాల కూర్చున్న ఉన్న సదా కు తలకు బలమైన గాయాలు అయ్యాయి.

also read:కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

ప్రమాద సంఘటనను చూసిన స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి గాయపడిన వీరిని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిని పరీక్షించిన వైద్యురాలు మనోరమ సదా మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి గత నెల 14న వివాహం అయింది. ఇరు కుటుంబాల ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నందిగామ ప్రాంతమే. వీరికి మధిరలో బంధువులు ఉండడంతో తిరుగు ప్రయాణంలో బంధువులంతా ఇక్కడ కొద్దిసేపు ఆగిన క్రమంలో వీరిరువురు బయలుదేరి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

also read :పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ

నవ వధువు మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బంధువుల మృతురాలి తల్లిదండ్రుల రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి. ప్రమాద సంఘటనకు సంబంధించి మధిర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube