రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.

. ఒకరికి గాయాలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,చిట్యాల:
చిట్యాల మండలం నుండి నైన్ పాక గ్రామ సమీపంలో బతుకమ్మ విగ్రహం వద్ద ట్రాక్టర్ టూవీలర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు ఒకరు గాయపడ్డారు వివరాల్లోకి వెళితే శాయంపేట గ్రామస్తులు మారేపల్లి నవీన్ మేఘన కుమారుడు పని నిమిత్తం అత్తగారింటికి అందుకుతండ వెళ్తుండగా నైన్ పాక ఊరి చివర్లో రోడ్డుపై ఎదురుగా వస్తున్న నైన్ పాక గ్రామానికి చెందిన పెద్ద మల్ల కుమార్ ట్రాక్టర్ ను ఢీకొన్న గా మారేపల్లి నవీన్ అతని కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా మేఘన తీవ్ర గాయాలతో చికిత్స కోసం 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చిట్యాల సిఐ పులి వెంకట్ ఎస్ ఐ కృష్ణ ప్రసాద్ చేరుకొని కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి వివరాలు తెలుసుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube