రోడ్డును వెంటనే వెడల్పు చేయాలి
టీ మీడియా, నవంబర్ 28, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రం నుండి కాసింనగర్, రేమద్దులకు వెళ్ళే రోడ్డు 10 ఫీట్లకే కుచించుకపోయి ఉన్న స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదాల బారినపడుతున్న దాదాపు 8 గ్రామాల ప్రజలు, కనుక వెంటనే రోడ్డును 33 ఫీట్లుగా వెడల్పు చేయాలని డిమాండ్ చేసిన జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక. గ్రామ ప్రజలు , ప్రజా ప్రతినిదులు అఖిలపక్ష ఐక్యవేదిక ను సంప్రదించి, మా రోడ్డు ఒకసారి పరిశీలించమని కోరితే, అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు సోమవారం వెళ్లి పరిశీలించి అక్కడ ఉన్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం నుండి కాసిం నగర్ వైపు రోడ్డుకు తాళ్లచెరువు సుందరీకరణ ద్వారా బైపాస్ వేసి చాలా మంచి పని చేసిన మంత్రి కానీ అక్కడి నుండి 21వ వార్డు ద్వారా కాసిం నగర్ కు వెళ్లే రోడ్డు రెవెన్యూ లో 33 ఫీట్లుగా నిర్ణయించబడింది.
Also Read : పాదయాత్రలో సైక్లిస్ట్‌గా మారిన రాహుల్ గాంధీ
కానీ, 10 ఫీట్లు ఉంది. అక్కడ వేసిన తారు రోడ్డు గతంలో ఉన్న బండ్లబాటకు మాత్రమే వేశారు. ఈ సమస్యపై గతంలో అక్కడి ప్రజాప్రతినిధులు పలుమార్లు కమిషనర్‌ను, జిల్లా కలెక్టర్ ను కలవడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు ఆ సమస్య తీరలేదు.బైపాస్ రోడ్డు చేసి వారికి మంచి చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి ఆ రోడ్డును కూడా వెడల్పు చేసి కాసింనగర్ రోడ్డు సుందరీకరణ చేయవలసిందిగా అఖిలపక్ష ఐక్యవేదిక కాశీంనగర్ ప్రజలు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జానంపేట రాములు, పానుగల్ మండల అధ్యక్షుడు పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు, వెంకటేష్, రమేష్, కుంకి రమేష్ కాశీం నగర్ ప్రజలు పాల్గొన్నారు.