బడ్డీకొట్టు తొలగింపుకు రంగం సిద్ధం

చిరు వ్యాపారులతో మాట్లాడిన ట్రైనీ కలెక్టర్ రాహుల్

1
TMedia (Telugu News) :

బడ్డీకొట్టు తొలగింపుకు రంగం సిద్ధం

చిరు వ్యాపారులతో మాట్లాడిన ట్రైనీ కలెక్టర్ రాహుల్

టీ మీడియా,మార్చి 3, మధిర:పట్టణంలో బ్రిడ్జి కింద ఉన్న బడ్డీకొట్టను మెయిన్ రోడ్లో అడ్డంగా ఉన్న బడ్డీ కొట్లను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం ట్రైనీ కలెక్టర్ రాహుల్ మధిర పట్టణంలో పర్యటించి ఏ ఏ ప్రాంతాల్లో బడ్డీ కొట్లు ఉన్నాయి. అవి ట్రాఫిక్ కి ఇబ్బందిగా ఉన్నాయా? లేవా? అని పరిశీలించారు.

 also read:వంట గ్యాస్‌ సిలిండర్‌లలో    మోసం 

ఇటీవల జిల్లా కలెక్టర్ గౌతమ్ మధిరలో పర్యటించిన సందర్భంగా అనేక బడ్డీ కోట్లు మూసివేసి ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ కమిషనర్ రమాదేవితో మధిరలో బడ్డీ కోట్లు పెట్టి మూసివేస్తే అవార్డులు వస్తాయా? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా బోనకల్ వెళ్తూ బ్రిడ్జి కింద ఉన్న బడ్డీ కొట్లు తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

   also read :ఐదుపంచాయతీలపై ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి

మధిర బోనకల్లు ప్రాంతాల్లో అనేక బడ్డీ దుకాణాలు చిరువ్యాపారులు చేతిలో లేకుండా బడా వ్యాపారుల చేతిలో ఉన్నాయని, వాటిని అద్దెకి ఇస్తున్నట్లు ఆరోపణలు రావడంతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ట్రైనీ కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. దీంతో ట్రైనీ కలెక్టర్ రాహుల్ మధిరలో పర్యటించి నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందించనున్నారు ఆయన వెంట తహసిల్దార్ రాజేష్ కమిషనర్ రమాదేవి ఉన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube