రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
టీ మీడియా ఏప్రిల్ 28,జగిత్యాల :పట్టణంలో జిల్లా మెడికల్ కాలేజీ చుట్టూ నలువైపులా రహదారుల అభివృద్దిలో భాగంగా చిన్న కెనాల్ నుండి రామాలయం వరకు రోడ్ల నిర్మాణం, బస్ డిపో నుండి మాతా శిశు సంరక్షణ కేంద్రం వరకు బిటి రోడ్డు, నటరాజ్ చౌరస్తా నుండి బసవేశ్వర విగ్రహం వరకు బిటి రోడ్డు, ఐ డి ఓ సి (నూతన కలెక్టరేట్) నుండి అంతర్గాం రోడ్డు వరకు 4 లైన్ల బిటి రోడ్డు (బ్యాలెన్స్ రీచ్) అభివృద్ది పనుల కోసం 11 కోట్ల 15 లక్షల తో చేపట్టిన అభివృద్ది పనులను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ చాలా ఉపయోగమని పేర్కొన్నారు. జిల్లా నడి బొడ్డున 500 కోట్ల తో కళాశాల ఏర్పాటు, ప్రజలకు రవాణా దృష్ట్యా, వసతుల దృష్ట్యా అనువైన ప్రాంతం ఎంపిక చేయటం జరిగిందన్నారు. త్వరితగతిన పనులు మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. మెడికల్ కళాశాలకు 150 కోట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు.
AlsoRead:వేదాలు విజ్ఞాన భాండాగారాలు
11 కోట్ల తో రోడ్ల అభివృద్ది పనులు చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు. సిటీ స్కాన్, డయాగ్నొస్టిక్ కేంద్రం, రేడియాలజీ కేంద్రం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగమన్నారు. మెడికల్ హబ్ గా జగిత్యాల జిల్లా కేంద్రం, నేటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చుట్టూ పక్కల జిల్లాల నుండి సైతం ప్రజలు వస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే యావర్ రోడ్డు వెడల్పులో అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు. 1000 మీటర్ల పొడవునా ప్రభుత్వ స్థలాలు వెడల్పు చేసి, అధునాతన డ్రైనేజీ నీ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు ఓద్ధి శ్రీలత రామ్మోహన్ రావు, జుంబర్తి రాజ్ కుమార్, పట్టణ పార్టీ కార్యదర్శి బాయిన్పల్లి ప్రశాంత్ రావు, ఎఫ్ సి ఎస్ డైరక్టర్ ఆరుముళ్ల పవన్, బింగి రాజేశం, వొంటిపులి రాము, రాకేష్, ఉమెందర్, శ్రీనివాస్, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube