రోడ్డు వెడల్పులో చిత్ర విచిత్రాలు

రోడ్డు వెడల్పులో చిత్ర విచిత్రాలు

1
TMedia (Telugu News) :

రోడ్డు వెడల్పులో చిత్ర విచిత్రాలు

టీ మీడియా, నవంబర్ 4, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణ ప్రజల విజ్ఞప్తితో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు రోడ్డు వెడల్పును పరిశీలించి బిత్తర పోయారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఇన్నాళ్ళకు రోడ్డు వెడల్పు అవుతుండడంతో సంతోషపడాలో లేక ప్రజాప్రతినిధులు అధికారుల లాలూచీ తనానికి బాధపడాలో తెలియడంలేదని మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్డు వెడల్పును కిందిస్థాయి ప్రజా ప్రతినిధులు నీరు కారుస్తున్నారని ప్రజలు ఆగ్రహం వెళ్లిబుచుతున్నారని


రోడ్డు వెడల్పులో మధ్య నుంచి 40 ఫీట్లుగా నిర్ణయించి కాలువలు వేస్తున్నారని కానీ కొన్నిచోట్ల డబ్బు ఉన్నవారికి, ప్రజాప్రతినిధుల చుట్టాల వారికి, మేలు చేసే విధంగా ఒకచోట 38 ఫీట్లు ఒకచోట 36 ఫీట్లు ఒకచోట 42 ఫీట్లు ఎలా తోస్తే అలా మలుపులు తిప్పుకుంటూ కాలువను ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు కూడా అలాగే మలుపులు తిరుగుతూ పోతుంది.కనుక తక్షణమే ఊర్లో ఉన్న ప్రజలు, కోటీశ్వరులు, వాళ్ళందరూ ఒకటే అనుకుని రోడ్డు మధ్యలో నుండి 40 ఫీట్లు గా చూస్తే నచ్చే విధంగా ఉండాలని ప్రజలు, అఖిలపక్ష ఐక్యవేదిక కోడుతుందని అన్నారు.

Also Read : అదుపుతప్పిన బైక్‌.. ఇద్దరు యువకులు మృతి

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ భాష వీటిని గమనించడానికి ఒకసారి రోడ్డు అంత తిరుగాలని, పరిశీలించి చర్యలు తీసుకోవాలని లేనిచో పేద ప్రజలవి 42 ఫీట్లు, ఉన్న వారివి 38 ఫీట్లు తీయడాల్ని హెచ్ఆర్సీలో,లోకాయుక్తకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ చీర్ల చందర్, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్,వైయస్సార్ టిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, సమాధి వాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జానoపేట రాములు, తెలుగుదేశం పానగల్ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ, సిపిఐ కార్యదర్శి రమేష్, వనపర్తి ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube