వర్షానికి బురదగా మారిన రోడ్లు

నీటి కాలువలను తలపిస్తున్న రహదారులు

1
TMedia (Telugu News) :

వర్షానికి బురదగా మారిన రోడ్లు

-నీటి కాలువలను తలపిస్తున్న రహదారులు
టీ మీడియా, ఆగస్టు 02, మహానంది: మండలంలోని గాజులపల్లి గ్రామంలోఅంతర్గత రోడ్లు అధ్వానంగా వున్నాయి. చిన్నపాటి వర్షానికి రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read : ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

గ్రామంలో వర్షాలు పడినప్పుడు రోడ్లు బురదగా మారడంతో స్థానిక ప్రజలు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినప్పుడు డ్రెనేజీ కాలువలు లేకపోవడంతో నీళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలోని వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube