మిషన్ భగీరథతో ధ్వంసమైన రోడ్లు

మిషన్ భగీరథతో ధ్వంసమైన రోడ్లు

1
TMedia (Telugu News) :

మిషన్ భగీరథతో ధ్వంసమైన రోడ్లు

టీ మీడియా, మే 26, వనపర్తి బ్యూరో : అఖిలపక్ష ఐక్య వేదిక సభ్యులు వార్డులో పరిశీలనలో భాగంగా మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ అఖిలపక్ష ఐక్య వేదిక కన్వీనర్‌, చిరంజీవి బిఎస్పి ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ
మిషన్ భగీరథ పేరుతో వనపర్తి పట్టణంలోని అన్ని రోడ్లను ధ్వంసం చేసినన మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు అధికారులు మిషన్ భగీరథకు ఎన్ని కోట్లు కేటాయించారు.ఎంత పని అయ్యింది ఎంత అవ్వాల్సి ఉంది. నాణ్యత లేకుండా వేసిన పైపులు మళ్లీమళ్లీ పగలడంతో రిపేర్ల పేరుమీద మళ్లీ మళ్లీ తవ్వేసి అలాగే విడిచిపోవడంతో ప్రజలు దాంట్లో పడి కాళ్ళు చేతులు వీరకొట్టుకుని, ఆస్పత్రిల పాలు అవుతున్నారు. అసలు మిషన్ భగీరథ జీవో ప్రకారం పని చేస్తున్నారా లేక అది నాయకుల కనుసన్నలలో అవసరమైనచోట చేస్తున్నారా అయినా పనులు చూస్తే అవమానం రేకెత్తుతున్నాయి.

Also Read : ఆత్మహత్య చేసుకున్న డాక్టర్

ప్రభుత్వ జీవో ప్రకారం ఎక్కడ పైపులైన్ల కోసం తవ్వితే అక్కడ రోడ్డు వేయాల్సి ఉంటుంది. కానీ వనపర్తిలో ఉన్న నాయకులు చెప్పినట్లు కొన్ని రోడ్లు వేసి చేతులు దులుపు కుంటున్న అధికారులు. తక్షణమే వనపర్తి రోడ్లను మరమ్మతులు చేసి ప్రజల రవాణాకు అడ్డంకులు లేకుండా చూడాలి. వనపర్తిలోని ఆర్టీసీ కాలనీలో యాదవ సంగం బిల్డింగ్ దగ్గర 2 నెలల క్రితం త్రవ్విన ఒక గుంత అలాగే విడిచిపెట్టడంతో ఇంకో పక్క రోడ్డు మూసుకుపోయి మరొక పక్క నుంచి వచ్చే వాళ్ళు దాంట్లో పడుతుండటంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో అలాగే మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు వాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో వనపర్తిలోని రోడ్లు ఎగుడు దిగుడుగా ఉండి ఇక్కడి గుంతలు అక్కడనే అలాగే ఉన్నాయి. సంబంధిత అధికారులు నేతలు పట్టించుకోని ప్రజలు పడుతున్న తిప్పలు తొలగించాలని అఖిల పక్ష ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేసున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube