రోడ్డును త్వరగా పూర్తి చేయాలి

అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్

1
TMedia (Telugu News) :

రోడ్డును త్వరగా పూర్తి చేయాలి

అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్

టీ మీడియా, జూలై 29, వనపర్తి బ్యూరో : గోపాల్పేట లోని కస్తూర్బా బీసీ అతిథి గృహాన్ని కూడా ప్రారంభించాలి.
BC వసతి గృహము మూడు సంవత్సరాల కింద శాంక్షన్ అయ్యి, శిలాఫలకం వేసిన కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. వెంటనే పూర్తి చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపాల్పేట ప్రజలు గోపాల్పేట మండల అఖిలపక్ష నాయకులు ఈ సమస్యలను మా దృష్టికి తెచ్చినందున శుక్రవారం గోల్పేట ఏదుల రోడ్డును పరిశీలించడం జరిగింది . అలాగే అక్కడే ఉన్న కస్తూర్బా స్కూలు ముందు శిలాఫలకం చూయించిన నాయకులు ఇది కోటి రూపాయల పైగా శాంక్షన్ అయ్యి శిలాఫలకం వేసినారు కానీ పనులు ప్రారంభించలేదని తెలిపడంతో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా నాయకులు వచ్చి గోపాల్ పేట ఎదుల రోడ్డును పరిశీలించి, బీసీ అతిధులు గృహ శిలాఫలకాన్ని పరిశీలించారు.

 

Also Read : ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి

 

మూడేళ్లుగా ఒక రోడ్డు శాంక్షన్ అయి కూడా, టెండర్ పూర్తయి, పనులు ప్రారంభమైన కూడా నత్త నడక సాగుతూ, ప్రజలకు నరకాలు చూపిస్తున్న ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ పై ఒత్తిడి తేవాలని జిల్లా కలెక్టర్ కి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి అఖిలపక్ష ఐక్యవేదిక ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. అలాగే బీసీ వసతి గృహాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని వెనుకబడిన విద్యార్థులకు వసతి కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో
అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్,
కో కన్వీనర్ చిరంజీవి, ఉపాధ్యక్షులు వెంకటేష్, రమేష్, ఆంజనేయులు తోపాటు గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, సుధాకర్ రావు, ఏదుట్ల కాంగ్రెస్ నాయకులు విష్ణు, జనార్దన్ శ్రీనివాసులు రాములు గోపాల్పేట ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube