రోడ్ల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

రోడ్ల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

1
TMedia (Telugu News) :

రోడ్ల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

టీ మీడియా, అక్టోబర్ 29, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతబజార్ లో రోడ్ల విస్తరణ పనులను శనివారం పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి హైదరాబాద్ రోడ్డులో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్. లోక్ నాథ్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు వైపు జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పాతబజార్ కాలనీవాసులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ అక్కడక్కడ డ్రైనేజీ పనులు, విద్యుత్ ట్రాన్స్ పార్మర్ మార్పిడి పెండింగ్ పనుల కారణంగా రోడ్ల విస్తరణకు ఆటంకం కలుగుతుందని, వెంటనే మున్సిపల్ అధికారులు విద్యుత్ అధికారులు సమన్వయంతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

Also Read : మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసులో హైకోర్టు కీలక తీర్పు

రోడ్ల విస్తరణ పనులు పూర్తి అయ్యేవరకు మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, విస్తరణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు.అయితే వనపర్తి మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం పట్ల జడ్పి చైర్మన్ మండిపడ్డారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube