రోశయ్య సేవలు మరువలేనివి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 4 వనపర్తి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అకాల మృతికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. శనివారం రోజు వనపర్తి పట్టణంలో రాజీవ్ చౌక్ దగ్గర రోశయ్య చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. గృహ నిర్మాణ మంత్రిగా ఆర్థిక, విద్యుత్, ఆరోగ్య మంత్రిగా సేవలందించారు. శాసన సభా వ్యవహారాల మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎన్నో సేవలు చేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, పిసిసి సభ్యులు శ్రీనివాస్గౌడ్, డి కిరణ్ కుమార్ ,తిరుపతయ్య, శంకర్ నాయక్, కోట్ల రవి, చీర్ల జనార్ధన్ ,బాబా, రాములు, పాండు సాగర్, మధు గౌడ్, దివాకర్ ,మన్యంకొండ, అబ్దుల్లా వెంకటేశ్వర్రెడ్డి, బాబా, యాదగిరి, రమేష్ ,సత్యం, నరేష్ ,శివ, విజయ్, డి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

The Congress Party extends its deepest condolences on the ultimately death of Andhra Pradesh Roshaiya.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube