ప్రసూతి వైద్యురాలు గా మంచి పేరు తెచ్చుకోవాలి రోటరీ సంస్థ ద్వారా మరిన్ని సేవలు అందించాలి:

0
TMedia (Telugu News) :

డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి,

టీ మీడియా, డిసెంబర్, 24, భద్రాచలం

ఆరోగ్య ఆసుపత్రి నందు ప్రసూతి విభాగానికి అధినేతగా ప్రసూతి వైద్య సేవలు ప్రారంభించిన డా.అలీనా శాంతికి తెలంగాణ రాష్ట్ర మరియు గుంటూరు ప్రకాశం జిల్లాల అంతర్జాతీయ రోటరీ సంస్థ జిల్లా 3150 గవర్నర్ నామిని అయిన గౌరవ డాక్టరేట్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి పుష్ప గుచ్చం అందించి అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అలీనా శాంతి ని ఉద్దేశించి,
వైద్యానికి మించిన సేవ మరొకటి లేదు అని, ఏజెన్సీలోని మాతృమూర్తులకు సేవలందించడానికి ముందుకు వచ్చిన డాక్టర్ అలీనా శాంతికి డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ, మంచి ప్రసూతి వైద్యురాలు గా పేరు తెచ్చుకోవాలని.

రోటరీ ఇంటర్నేషనల్ సంస్థలో కూడా సభ్యులుగా చేరి ఈ మారుమూల ప్రాంతంలో వైద్యంతో పాటు మరిన్ని సామాజిక సేవలతో ఏజెన్సీ ప్రజానీకానికి సేవలందించి సేవాతత్పరతలో పునీతం కావాలని డాక్టరేట్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి డాక్టర్ అలీనా శాంతి తో ఉద్ఘాటించారు.

వైద్యం కోసం వచ్చే మహిళల నుండి న్యాయబద్ధమైన ఫీజులు తీసుకుని నాణ్యమైన సేవల ద్వారా సేవల ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఆకాంక్షించారు.

డాక్టర్ అలీనా శాంతిని అభినందించిన డాక్టరేట్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి తో పాటుగా రొట్టెరియనులు డా.కల్వకూరి అబ్రహం, గొండేల సుధాకర్, వేగేశ్న శ్రీనివాసరాజు మరియు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube