టీ మీడియా, డిసెంబర్ 26, మహానంది:
మహానంది మండల పరిధిలోని ఆర్ ఎస్ గాజులపల్లి గ్రామ పంచాయతీ నందు ఆదివారం సహజమరణంతో చనిపోయిన బండమీది బాల మునెమ్మ అనే మహిళకు వైయస్సార్ భీమా పథకం క్రింద వారి అక్క ఎర్రమల మునెమ్మకు అంత్యక్రియలకు ప్రభుత్వం నుండి తక్షణం సహాయంగా పది వేల రూపాయలను ఆర్ ఎస్ గాజులపల్లి సర్పంచ్ షేక్ అస్లాం బాషా, మహానంది ఎంపీడీఓ సుబ్బ రాజు, అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వినాయక్, వార్డ్ మెంబెర్స్, ఆర్ ఎస్ గాజులపల్లి వాలంటీర్స్ శిరీష, షేక్ షావలి, విష్ణు వర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.