ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరఢా.. హైవేపై తనిఖీలు

ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరఢా.. హైవేపై తనిఖీలు

0
TMedia (Telugu News) :

ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరఢా.. హైవేపై తనిఖీలు

టీ మీడియా, జనవరి 11, హైదరాబాద్‌ : నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపించారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా హైదరాబాద్‌ హయత్‌నగర్‌ పరిధిలోని భాగ్యలత వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్తున్న బస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన ప్రమాణాలు పాటించని పది ప్రైవేటు బస్సులపై కేసులు నమోదుచేశారు. ప్రైవేటు బస్సులు తప్పనిసరిగా ప్రమాణాలను పాటించాలని, లేనిపక్షంలో కేసులు నమోదుచేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Also Read : పృథ్వీ-2 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube