అత్యధిక ఆదాయం సాధించిన ఆర్టీసీ కండక్టర్ రాజేష్

సత్కరించిన డిపో మేనేజర్

2
TMedia (Telugu News) :

 

 

అత్యధిక ఆదాయం సాధించిన ఆర్టీసీ కండక్టర్ రాజేష్
– సత్కరించిన డిపో మేనేజర్

-ఆదాయవృద్ధిలో ఖమ్మండిపో కు ప్రథమ స్థానం

ఉద్యోగుల సమిష్టి కృషికి అభినందనలు
-డీఎం డి.శంకర్రావు.
టి మీడియా, జూన్ 11,ఖమ్మం సిటీ: అత్యధికఆదాయసంపాదించడం ద్వారా ఖమ్మం డిపోను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలపడానికి సమిష్టి కృషి చేసిన ఖమ్మం డిపో ఉద్యోగులందరికీ డిపో మేనేజర్ శంకర్రావు అభినందనలు తెలిపారు.ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దామని ఆదాయం సాదిద్దామని ఆయన ఉద్యోగులందరికీ పిలుపునిచ్చారు.

Also Read : నేటి నుండి జిల్లాలో ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటన.

శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం డిపో ఆవరణలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) టి.స్వామి అధ్యక్షతన ఏర్పాటైన గేట్ మీటింగ్ లో డిపో మేనేజర్ డి.శంకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని అత్యధిక ఆదాయం సాధించిన కండక్టర్ జె.రాజేష్ నుశాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఇంట్లో ఉండే ఇబ్బంది పడుతున్న కాలంలో సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించి అత్యధిక ఆదాయం సాధించడం ద్వారా స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఉద్యోగులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 

Also Read : అధికారం మాటున భూ దందాలు
కండక్టర్లు ప్రతి కిలో మీటరు కు జె.రాజేష్ భద్రాచలం రూటులో రు.72.49/- ఆర్.ఉప్పలయ్య విజయవాడ రూటులో రు.67.34/- వి.శ్రీదేవి ఇల్లందురూట్లో రు.57.62/- ఎండి.షరీఫ్ మణుగూరు రూటులో రు.61.43/- ,మరియు డ్రైవర్లు బి.కోటేశ్వరరావు హైదరాబాద్ రూట్లో రు.82.94/- ఎం.వీరయ్య హైదరాబాద్ రూట్లో రు. 82.72/- సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. వీరి స్ఫూర్తితో అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) పి.శ్రీనివాస్,వి. చంద్రశేఖర్,డిప్యూటీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జీ.రజిత,డ్యూటీ చార్ట్ కంట్రోలర్ ఆకుతోట శ్రీనివాసరావు,సెక్యూరిటీ కానిస్టేబుల్ కె.భాస్కర్, ఉద్యోగుల సంక్షేమ మండలి సభ్యులు దమ్మాలపాటి శ్రీనివాసరావు,డ్యూటీ బుకింగ్ ఏడిసి లు విఆర్కే చారి,జేవీలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube