మంత్రిని కలిసిన ఆర్టీసీ డిఎం

మంత్రిని కలిసిన ఆర్టీసీ డిఎం

1
TMedia (Telugu News) :

మంత్రిని కలిసిన ఆర్టీసీ డిఎం

టీ మీడియా, సెప్టెంబర్ 23, వనపర్తి బ్యూరో : నూతనంగా వచ్చినటువంటి డిఎం పరమేశ్వరి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పూర్వ డియం సుబ్బరాజు, ఆర్టీసీ నాయకులు నీలస్వామి, రవీందర్ గౌడ్, రవి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Also Read : ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలకు సేవ భావంతో పనిచేస్తూనే సంస్థ యొక్క ఆదాయం పెంచుకునే మార్గాలను ఎంచుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా బస్ డిపో కొత్త బస్టాండు స్థలాలలో రోడ్డు విస్తరణలో పోయిన భాగాన్ని వదిలేసి షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube