మర్యాద లేని “పొస్ట్”
– వచ్చినప్పుడే విధులు
– కుర్చీ కావాలంటే కొట్లాట తప్పుదు
– దప్పిక అయితే గొంతు ఎండుడే
– నగదు లావాదేవీల కే అనుమతి
– ఇంగ్లీష్ వస్తేనే వివరాలు తెలిసేది
టీ మీడియా,ఆగస్టు 3,ఖమ్మం సిటీ బ్యూరో: అవును అక్కడి కి వెళ్ళిన ఎంతటి వారు అయిన సరే వారు వచ్చినప్పుడు మాత్రమే సేవలు పొందాలి.కుర్చీ కావాలి అంటే ఉన్న వారు ఖాళీ ఎప్పుడు చేస్తారో చూడాలి లేదంటే గొడవకు దిగాలి. కేంద్ర ప్రభుత్వ శాఖలలో నగదు రహిత సేవలు కు ఆదేశిస్తూ ఇక్కడ యుపి ఐ స్కానర్ పెట్టరు అక్కడి వారు ఆధి తొలగించి నగదు అయితేనే తీసు కొంటాం అంటూ అమలు చేస్తున్నారు. త్రాగడానికి నీళ్ళు,అత్యవసరం లో వినియోగానికి టాయిలెట్లు ,కార్యాలయం బద్రత్త ఉద్యోగి కనిపించవు.వీధి కుక్కలు,ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తాయి. పిర్యాదు చేద్దాం అంటే పుస్తకం ఉండదు..ఉన్నత అధికారి కి పిర్యాదు చెడ్డమని కార్యాలయం వెబ్ సైట్ లోని నెంబర్ కి ఫోన్ చేస్తే .నెంబర్ సరి చూసుకోండి అంటోంది. అడ్డ గోలు వ్యవహారాలు కు అడ్డ గా మారిన ఖమ్మం నగర హెడ్ పోస్ట్ ఆఫీస్ లో టి మీడియా బృందం క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది.
alsoread:రెండేళ్ల లో ఖమ్మం స్వరూపం మారుతుంది
నిత్యం రద్దీగా ,జనం తో కిట,కిట లాడే నగరం లోని శ్రీనివాస థియేటర్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ తపాలా శాఖ కార్యాయ సేవలు పొందకుండా , సమీపం లోని ప్రవైట్ సంస్థ ల వైపు వెళ్లే విధంగా కార్యాలయ సిబ్బంది కొందరు వ్యవహరిస్తున్న రు. ఆఫీస్ ఆ వరణలో వీధి కుక్కలు పహారా కాయడం పరిస్థితి కి అద్దం పడుతుంది..సేవా దృక్పథం మాట అట్లా ఉంచితే ఏ సేవ ఎక్కడ లభిస్తున్నది ఆన్న బోర్డు లు సక్రమంగా లేవు పార్సిల్ సెక్షన్ అని ఇంగ్లీష్ బోర్డ్ ఏర్పాటు చేసిన కౌంటర్ కు బదులు ,వేరే కౌంటర్ లో తీసు కొంటున్నారు .పోస్టల్ కార్యాలయం బైటి బోర్డ్ వెలిసి పోయినా పట్టించు కొని స్థితిలో ఉన్నారు.
సౌకర్యాలు లేవు
జalsorad :లగం”ప్రమాణస్వీకారం వాయిదే
కార్యాలయం లోపల విజిటర్స్ కోసం ఖాళీ స్థలం ఉంచారు.డిపాజిట్ లు,ఇతరత్ర సేవలు కోసం సీనియర్ సిటీ జన్ లు ప్రతి రోజూ 200ల మందికి పైగా సీనియర్ సిటీ జెన్ లు వస్తారు.ముఖ్యంగా ఆధార్ ఆధారంగా డబ్బులు డ్రా చేసుకొనే సౌకర్యం కోసం కూడా వస్తారు.కేవలం 3 సీట్లు ఉన్న విరిగిపోయిన బల్ల లాంటి ది మాత్రమే అక్కడ ఉంది.మంచి నీళ్ళు, టాయి లెట్లు అనేవి లేవు.ఉన్నవి సిబ్బందికి పరిమితంచేశారు.అగ్నిప్రమాదం నివారణ పరికరాలు లేవు. ఉన్న బోర్డు లు ఇంగ్లీష్ లో పెట్టారు. మధ్యాహ్నం 1.15 కి టి మీడియా బృందం అక్కడి కి వెళితే ఓక అనధికార వ్యక్తి మాత్రమే ఉన్నరు.ఖాళీ కుర్చీలు గురించి అడిగితే బ్రాంచి సూపర్ డెంట్ తో సహా అందరూ భోజనం కు వెళ్ళారు 2 గంటలకు వస్తారు.నాకు అంతకు మించి తెలియదు కూర్చో మంటే ఉన్న అన్నారు. 2 తరువాత ఇద్దరు వచ్చారు .అందులో పార్సిల్ వ్యవహారం తో పాటు, మార్కెటింగ్ చూసే వ్యక్తి నీ టి మీడియా కొను గోలు కోసం అడిగింది.నగదు రహిత చెల్లింపు చేస్తాంఅంటే .కుదరదు నగదుమాత్రమేతీసుకొంటాంఅన్నారు. అయన కౌంటర్ గ్లాస్ కి ఉన్న యూ పి ఐ చెల్లింపు స్కానర్ చింపి వేసి కనిపించింది .పిర్యాదు పుస్తకం బ్రాంచి సూపర్ డెంట్ వద్ద ఉంది ఆన్న అక్కడి బోర్డ్ చూసి ,అయన ఛాంబర్ కి వెళితే కుర్చీ ఖాళీగా ఉంది.అప్పటి కి 2.30 గంటలు అయిన అయన రాలేదు.సమీపం లో ఇటీవల ప్రారంభించినట్లు బోర్డు ఉన్న పార్సిల్ ప్యాకింగ్ మిషన్ గురించి అక్కడి వారిని అడిగితే నవ్వడం జరిగింది.
కనిపించని బస్టాండ్ పోస్ట్ ఆఫీస్
ఖమ్మం సిటీ బస్టాండ్ అడ్రస్ తో ఉన్న పోస్ట్ కార్యాలయం కోసం వాకబు చేయగా 10 ఏళ్ళక్రితం ఎత్తి వేసి రికార్డు ల్లో చూపిస్తూ మేయింట నెన్స్ తీసు కొంటున్నట్లు తేలింది.నగరం లోని బురాన్ పురం పోస్ట్ ఆఫీస్ తో పాటు,పలు పోస్టాఫీసు లు రికార్డు ల్లో చూపిస్తున్న చోట లేవు.కొన్ని సొంత ఇళ్ళ లో ఏర్పాటు చేసి అద్దె ఇంట్లో పెట్టీ నట్లు చూపించి భారీ స్వాహా అనేది తేలింది.
పోస్ట్ డబ్బాలు మాయం
ఉత్తరాలు వేసే పోస్ట్ డబ్బాలు కూడా నగరం లో చాలా చోట్ల లేవు.ఉన్నట్లు, వాటిని తెరవడానికి ప్రత్యేక సిబ్బంది నీ పంపుతున్న మని,వర్షాకాలంలో ఆ సిబ్బంది కి గొడుగులు కూడా ఇస్తున్నట్లు చూపి స్వాహా పర్వం జరుగుతున్న దనేది సమాచారం.
సీసీ కెమెరాలు పైన అనుమానం
హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఎదురుగా మీరు సీసీ కెమెరా పరిధి లో ఉన్నారు అనే బోర్డ్ పెట్టారు .అసలు అవి పనిచేస్తున్న యా ఆన్న అనుమానం ఉంది
3 గంటల వరకే నట
నిబంధనలు ప్రకారం పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఉదయం 10 గంటల నుండి సాయింత్రం 6 గంటల వరకు.హెడ్ పోస్ట్ ఆఫీస్ లో మాత్రం 10 గంటల నుండి 3 గంటల వరకు కార్యాలయం పని వేళలు అని అతికించిన కాయిత లు కనిపిస్తున్న యి. స్థానికంగా నివాసం ఉండక పోయిన రైలు కు ముఖ్యంగా సాయింత్రం కృష్ణ రైలు కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసు కొన్నట్లు గా తెలుస్తోంది. మొత్తం అక్రమ వ్యవహారం ఉన్నత స్థాయి అధికారులు సమక్షంలోనే జరుగుతున్నట్లు గా తెలుస్తోంది. పోస్టల్ శాఖ కు ఉన్న మర్యాదను కొంత మంది కార్యాలయం సిబ్బంది పోగొడుతున్న రు.