నియమావళిని రాజకీయ పార్టీలుతప్పక పాటించాలి
-కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
టీ మీడియా, అక్టోబర్ 12, భద్రాద్రి కొత్తగూడెం : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు తు.చ. తప్పక పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయపు మిని సమావేశపు హాలులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నూతనంగా ఓటుహక్కు నమోదు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయలు కల్పన, దివ్యాంగులు, 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు ఇంటి నుండే ఓటుహక్కు వినియోగించుకునే సౌలభ్యత, ఓటరు స్లిప్పులు పంపిణీ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 31వ తేదీ వరకు ఓటుహక్కు నమోదుకు అవకాశం ఉన్నందున అర్హులను ఓటుహక్కు నమోదుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్వహించుటలో పిర్యాదులు చేసేందుకు 24 గంటలు పనిచేయు విధంగా 1950 కంట్రోల్ నెంబరు, అలాగే సి విజిల్ యాప్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వచ్చిన పిర్యాదులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు తు.చ. తప్పక పాటించాలని చెప్పారు. ప్రచారానికి సంబంధించి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు ఏర్పాటు తదితర వాటికి సువిధ సింగిల్ విండో ఆన్లైన్ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్లైయింగ్ స్క్వాడ్ టీములు పటిష్ట పర్యవేక్షణ చేస్తున్నాయని 50 వేలకు మించి నగదు, విలువైన వస్తువులతో రవాణా చేయునపుడు ఆధారాలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సరైన ఆధారాలు చూపకపోతే సీజ్ చేస్తామని తదుపరి ముగ్గురు అధికారులతో ఏర్పాటు చేసిన కమిటి సిఫారసు మేరకు పట్టుబడిన నగదు, వస్తువులను విడుదల చేస్తామని చెప్పారు.
Also Read : సీఎం కేసీఆర్ వల్లే ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా సాధ్యమైంది
ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో ప్రచార సామాగ్రి ఏర్పాటుకు తప్పని సరిగా అనుమతి పత్రం తీసుకోవాలని, అనుమతి పత్రం లేకుండా తొలగిస్తామని చెప్పారు. పోలింగ్ ప్రక్రియకు ఐదు రోజులు ముందు నుండి బిఎల్ఎల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని చెప్పారు. దివ్యాంగ ఓటర్లును మార్కింగ్ చేశామని, ఇంకనూ ఎవరైనా మార్కింగ్ చేసుకోకపోతే తక్షణమే మార్కింగ్ చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలైన మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపు, వీల్చైర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా ఏర్పాట్లు లేనట్లు మీ దృష్టికి వస్తే తెలియచేయాలని సూచించారు. ఈవియంల ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపడతామని అట్టి సమాచారాన్ని అందచేస్తామని చెప్పారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రచార కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు కార్యాలయాలను తెలియచేశారు. పినపాక మణుగూరు తహసిల్దార్ కార్యాలయం, ఇల్లందుకు ఇల్లందు తహసిల్దార్ కార్యాలయం, కొత్తగూడెంకు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం, అశ్వారావుపేటకు అశ్వారావుపేట తహసిల్దార్ కార్యాలయం, భద్రాచలంకు సబ్ కలెక్టర్ ర్యాలయం, భద్రాచలంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఊ ఈ సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, డిటి రంగప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి యం ప్రభాకర్రావు, బిజెపి నుండి లక్ష్మణ్ అగర్వాల్, బిఆర్ఎస్ నుండి షేక్ అన్వర్, సిపిఐ నుండి వై శ్రీనివాసరెడ్డి, సిపిఐ (ఎం) నుండి అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube