ఆర్టీసీ బస్సులు నడపాలి

టీ మీడియా, మార్చి 9, వనపర్తి

1
TMedia (Telugu News) :

ఆర్టీసీ బస్సులు నడపాలి

టీ మీడియా, మార్చి 9, వనపర్తి : వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామానికి వెంటనే ఆర్టీసీ బస్సులు నడపాలని బీసీ సంక్షేమ సంఘం మదనాపురం మండల అధ్యక్షుడు మహేందర్ నాయుడు ఆధ్వర్యంలో ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రోజు వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టిసి బస్ డిపో అధికారులకు కలిసి వినతి పత్రం అందజేశారు.

Also Read :  కల్వ కుంట్ల రాజ్యాంగం అమల్లో ఉంది

ఈ సందర్భంగా మహేందర్ నాయుడు మాట్లాడుతూ గ్రామానికి ఆర్టిసి బస్సు రాకపోవడం వలన విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డిపో సిఐ చంద్రమౌళి అజ్జకొల్లుకు బస్సు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావలి మధులత నాయకులు నర్సింహా, లోకేష్, లక్ష్మణ్, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube