రూపాయి మరింత పతనం..

-డాలరతో పోలిస్తే 83.06 వద్ద ట్రేడింగ్‌

1
TMedia (Telugu News) :

రూపాయి మరింత పతనం..

-డాలరతో పోలిస్తే 83.06 వద్ద ట్రేడింగ్‌

టీ మీడియా,అక్టోబర్20, ముంబై : రూపాయి విలువ గురువారం మరింత పతనమైంది. ట్రేడింగ్‌ సమయంలో 6 పైసలు తగ్గి .. డాలర్‌తో పోలిస్తే 83.06 వద్ద ట్రేడ్‌ అయ్యింది. స్టాక్‌ ఎక్స్‌చేంజ్ వద్ద ఇవాళ డాలర్‌తో పోలిస్తే 83.05 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. ఆ తర్వాత మరింత దిగజారి.. 83.06కు చేరుకున్నది. గత క్లోజింగ్‌ మార్కెట్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆరు పైసలు తగ్గింది.బుధవారం కూడా ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కష్టానికి చేరుకున్నది. బుధవారం రూపాయి విలువ 60 పైసలు తగ్గింది.

Also Read : లగ్జరీ విల్లాను కొనుగోలు చేసిన ముకేశ్‌ అంబానీ

దాంతో డాలర్‌ విలువ 83 వద్ద నిలిచిపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడంతో రుపీ అల్లాడిపోయింది.పలు ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే భారత కరెన్సీ అత్యధికంగా పతనం కావడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు 11.75 శాతం దేశీయ కరెన్సీ విలువ జారుకున్నది. 2013 తర్వాత ఒకే ఏడాదిలో ఇంత నష్టపోవడం ఇదే తొలిసారి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube