మున్సిపల్ వార్డులలో పల్లెనిద్ర

మున్సిపల్ వార్డులలో పల్లెనిద్ర

1
TMedia (Telugu News) :

మున్సిపల్ వార్డులలో పల్లెనిద్ర

టీ మీడియా, ఆగస్టు 25, వనపర్తి బ్యూరో : వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఈరోజు వనపర్తి ప్రజా సంకల్ప యాత్ర ప్రజా సమస్యల పరిష్కారంలో ఇతరులు ఆదర్శం కావాలి ప్రజల భాగస్వామ్యం పెంచటం వారి సమస్యలు పరిష్కారం కోసమే వార్డులో పల్లె నిద్రలో అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లె నిద్రలు ఉపయోగపడతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆలోచన ఈ విధానంతో ప్రజాసంకల్పయాత్ర ద్వారా కార్యక్రమం అందుకే ప్రభుత్వ అధికారులు వాటిల్లో ఉండే ప్రజాసమస్యలు అంతవరకు జరిగిన పనులు ఇంకా ప్రజలకు జరగవలసిన అభివృద్ధి పనులు వివరిస్తూ అడుగుతూ వార్డులోని ఒకచోట బస చేసి వార్డు అంతా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని పై అధికారులకు తెలియజేయడానికి ప్రజా సంకల్ప యాత్ర గురువారం వనపర్తి మునిసిపల్ పట్టణంలో 18వ వార్డు నందు ప్రభుత్వ ప్రత్యేక అధికారి శ్రీనివాసులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వనపర్తి పర్యవేక్షణలో ప్రభుత్వ వివిధ శాఖల సమక్షంలో వార్డు కౌన్సిలర్ గంధం సత్యమ్మ శరవంద అధ్యక్షతన విధి విధి తిరిగి ప్రజల నుండి మంచి స్పందన ఏర్పడినది.

 

Also Read : ‘తెలంగాణను శ్రీలంకలా మారుస్తున్నారు’

ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇలా అధికారులతో వార్డులలో తిరిగి సమస్యలు అడగలేదని ప్రజలు తెలిపారు. ప్రజలకు కావాల్సిన వాళ్ళ సమస్యలు సిసి రోడ్లు, డ్రైనేజీలు, మంచినీళ్లు, సమస్యలు, పార్కులు, క్రీడా ప్రాంగణాలు,బస్తీ దవాఖాన, అంగన్వాడి భవనం, మహిళా భవనం, అంబేద్కర్ కళ భవనం, ప్రభుత్వ స్కూల్లో మూత్రశాలలు, వంటగది, ఇల్లు లేనివారికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కరెంటు స్తంభాలు అడిగారు. శాంతి భద్రతల విషయంలో వనపర్తి పట్టణ ఎస్ఐ యుగంధర్ రెడ్డి నీ సంప్రదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మున్సిపల్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ పాల్గొని ప్రజల నుంచి స్పందన తెలుసుకున్నాడు. అధికారులతో పాటు గంధం శరవంద, పరంజ్యోతి, గులాం ఖాదర్ ఖాన్, లతీఫ్, మున్సిపల్ అధికారులు బాలగోవిందు, ఆంజనేయులు, వెంకటేష్, వాటర్ లైన్మెన్ గణేష్ యాదవ్, మన్యం, వైద్య సహాయకులు గంధం సుమిత్ర, గంధం అరుణ, కమల, ఆశలు నారాయణమ్మ, ఆశమ్మ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube