పెళ్లింట విషాదం

బాల్క‌నీ కూలిపోవ‌డంతో ముగ్గురు మృతి

1
TMedia (Telugu News) :

పెళ్లింట విషాదం

బాల్క‌నీ కూలిపోవ‌డంతో ముగ్గురు మృతి

టి మీడియా, ఎప్రిల్ 22,ల‌క్నో : ఓ వివాహ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా ముగిసింది. ఆనందోత్సాహ‌ల మ‌ధ్య అంద‌రూ భోజ‌నం చేస్తుండ‌గానే.. ఆ పెళ్లింట విషాదం నెల‌కొంది. బాల్క‌నీ కూలిపోవ‌డంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బిజ్నోర్ ఏరియాలోని స‌రోజిని న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో గురువారం రాత్రి 11:30 గంట‌ల‌కు చోటు చేసుకుంది.

Also Read : చీకట్లోకి భారత్‌.. డజను రాష్ర్టాల్లో తీవ్ర విద్యుత్తు సంక్షోభం

స‌రోజిని న‌గ‌ర్‌లో గురువారం రాత్రి ఓ ఇంట్లో వివాహ వేడుక జ‌ర‌గింది. ఆ పెళ్లి ముగియ‌గానే అంద‌రూ భోజ‌నానికి సిద్ధ‌మ‌య్యారు. కొంద‌రు ఇంటి బాల్క‌నీ కింద కూర్కొని భోజ‌నం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో బాల్క‌నీ కుప్ప‌కూలిపోయింది. దీంతో అక్క‌డున్న వారిలో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రో 34 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల్లో ఒక చిన్నారి ఉంది. గాయ‌ప‌డిన వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube