మృతి చెందిన చిన్నారులకు నివాళులు

మృతి చెందిన చిన్నారులకు నివాళులు

1
TMedia (Telugu News) :

మృతి చెందిన చిన్నారులకు నివాళులు

టీ మీడియా, ఏప్రిల్ 25, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండలం జాతీయ రహదారిపై మెంటెపల్లి స్టేజ్ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపురం జలివాల పార్వతమ్మ శివ కూతురు ఆరాధ్య (4) హిమాన్ తేజ్(6) అంత్యక్రియలలో పాల్గొని నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్ అల్లారుముద్దుగా పెంచుకున్న ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదంలో మృత్యువు కబళించడం గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది.

 

Also Read : మన్యంలో మావోయిస్టుల అలజడి

 

వారిని చూసిన ప్రతి ఒక్కరు కన్నీటిపర్యంతమయ్యారు. శివ పార్వతమ్మ దంపతులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చిన్నారుల మరణానికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గ్రామ ప్రజాప్రతినిధులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారులకు నివాళులర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube