చిన్న జీయర్ దిష్టిబొమ్మ దహనం

1
TMedia (Telugu News) :

చిన్న జీయర్ దిష్టిబొమ్మ దహనం

టీ మీడియా,మార్చి 20,కరకగూడెం:ఆదివాసీలు సాంప్రదాయ పద్ధతిగా జరిపే మేడారం సమ్మక్క-సారక్క తల్లుల గురించి చిన్న జీయర్ చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ సమక్క సారలమ్మ గుడి అవరణ వరకు సమ్మక్క ధర్మ కర్తలు,పూజారులు , గ్రామస్తులు, వడ్డెలు,తలపతులు అధ్వర్యంలో శవ యాత్ర నిర్వహించి సమ్మక్క సారలమ్మ గుడి దగ్గర చిన్నజీయర్ దిష్టి బొమ్మ ను దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోయ పున్నేం 9 తెగల సమన్వయ కర్త చుంచు రామకృష్ణ ,గ్రామ సర్పంచు పాయం నర్సింహారావు, కోయ పున్నెం ధర్మకర్తలు చందా భూపతయ్య ,గోవర్ధన్ రావు,రామారావు,గోపి,సాంబశివరావు,చందా శ్యామ్ కుమార్,రామకృష్ణ,ఇరప వెంకటేశ్వర్లు,మరియు గ్రామస్తులు ,గ్రామ యువత పాల్గొన్నారు.

Also Read : గిరిజన రిజర్వేషన్ వెంటనే 10 శాతం పెంచాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube