పెండ్లికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు

పెండ్లికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు

1
TMedia (Telugu News) :

పెండ్లికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు
టీ మీడియా,ఏప్రిల్ 22,నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సరదాగా వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆ యువకులు అంతలోనే మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు అలీసాగర్ ఎత్తి పోతల పథకం స్టేజ్ -2 కాల్వలో పడి మృతి చెందారు.

Also Read : మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం

ఈ విషాదకర సంఘటన రెంజల్ మండలం బాగేపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది.స్థానికుల కథనం మేరకు.. బోధన్ మండలం కలుదుర్కి గ్రామానికి చెందిన శ్రీకాంత్, ఖండ్గావ్ గ్రామానికి చెందిన శ్రవణ్ రెంజల్ మండలం కునేపల్లి గ్రామంలో ఓ పెండ్లికి వచ్చి.. ప్రమాదవశాత్తు కాలువలో జారీ పడటంతో మృత్యువాత పడ్డారు. రెంజల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube