గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి

ఎమ్మెల్యే కోరుకంటి చందర్

1
TMedia (Telugu News) :

గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి

-ఎమ్మెల్యే కోరుకంటి చందర్

టీ మీడియా,మర్చి 14, గోదావరిఖని :

రామగుండం ఎన్టీపిసీ ప్రభావిత గ్రామమైన కుందనపల్లిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.సోమవారం అసెంబ్లీ సమావేశాలలో కుందనపల్లి బూడిద చెరువు విషయమై ప్రస్తవించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కుందనపల్లి గ్రామ సమీపంలోని బూడిద చెరువు కారణంగా గ్రామస్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నరని అనేక వ్యాధులకు గురిఅవుతున్నరన్నారు. గ్రామాన్ని తరలించాలని గ్రామస్తులు పలు మార్లు ఎన్టీపీసీ యాజమాన్యనికి విన్నవించి గ్రామస్తులు పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుందన్నారు. బుడిద చెరువు మూలంగా గాలి,నీరు కలుషుతమై అనేక వ్యాధులకు గురై 40 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. గ్రామాన్ని మరో ప్రాంతానికి తరలించాలని ప్రత్యేకంగా మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోకపోతే గ్రామస్తులతో పాటు తాము 28 కిలోమీటర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశామన్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటెష్, జిల్లా కలెక్టర్ తో మాట్లాడటం జరిగిందన్నారు.ఎన్టిపిసి యాజమాన్యంతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఎర్పాటు చేసీ కుందనపల్లి గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.

Also Read : వీధి విక్రయదారుల సమావేశం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube