సాగర్ నీరు సమృద్ధిగా ఇవ్వాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

0
TMedia (Telugu News) :

సాగర్ నీరు సమృద్ధిగా ఇవ్వాలి

-సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

టి మీడియా, ఫిబ్రవరి 27,ఖమ్మం : జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందాల్సిన సాగర్ జలాలను సమృద్ధిగా ఇవ్వాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. స్థానిక మంచి కంటి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో మాట్లాడారు.విడతల వారీగా నీరు ఇవ్వడం వల్ల చివరి ఆయకట్టులో పంటలు ఎండుతున్నాయన్నారు. 6000 క్యూసెక్కుల నీరు వదలాల్సి ఉండగా రెండున్నర వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారని తెలిపారు. జిల్లా మంత్రి జోక్యం చేసుకొని సరిపడా నీరు అందేలా చూడాలన్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల తీసివేతను వ్యతిరేకించారు. కేంద్రం సహకార రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతకుముందు పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి ప్లీనం సంతాపం తెలిపింది. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

Also Read : పుతిన్‌ని ఆయన సన్నిహితులే హతమారుస్తారు : జెలెన్‌స్కీ

పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, వై. విక్రమ్, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వర్లు, చింతలచెరువు కోటేశ్వరరావు, బుగ్గ వీటి సరళ, పార్టీ సీనియర్ నాయకులు ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube