సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఈటల రాజేందర్

నిరసన చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్

1
TMedia (Telugu News) :

సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఈటల రాజేందర్
నిరసన చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్
టీ మీడియా, ఏప్రిల్21,ఖమ్మం :తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను మించిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు . ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని బుధవారం బీజేపీ నేతలు పరామర్శించారు . ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ నేతలు , పోలీసులు అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు . శిశుపాలుడు ఏ విధంగా 100 తప్పులు చేసి శిక్షకు గురయ్యాడో సీఎం కేసీఆర్ కూడా వంద తప్పులు చేశారని , ఇక శిక్ష తప్పదని అన్నారు . సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన టిఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read : ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ఆత్మహత్యయత్నం

తెలంగాణ ప్రజానీకం కేసీఆర్పై విశ్వాసం కోల్పోయారని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అక్రమాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు . కేసీఆర్ను గద్దెదించే సమయం ఆసన్నమైందన్నారు . బీజేపీ నాయకులు , కార్యకర్తలు అధైర్యపడొద్దని , ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటామని , ధైర్యంగా పోరాడదామని అన్నారు . సాయి గణేష్ కుటుంబానికి అండగా నిలబడతామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో గల్లా సత్యనారాయణ , శ్రీధర్రెడ్డి , రుద్ర ప్రదీప్ , నున్న రవి , శ్రీదేవి , సరస్వతి , సుజాత తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube