సాయి సెక్యూరిటీ ఏజన్సీ పై చర్యలు తీసుకోవాలి…..

విధులు బహిష్కరించి భైఠాయించిన సిబ్బంది…..

కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం……

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగుల పట్ల “వారియర్స్” గా విధులు నిర్వహిస్తున్న రోగి సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు రోడ్డెక్కారు. వారు లేనిదే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు ఏ పని జరగదు.” సాయి సెక్యూరిటీ” ఏజన్సీ ద్వారా సుమారు 200 ల మంది విధులు నిర్వహిస్తున్నారు.
వారికి గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆవేదనతో ధర్నా కు దిగారు. హాస్పిటల్ సూపరిండెంట్ ను కలిసి జీతాల ప్రస్తావన అడిగితే మాకు సంబంధం లేదు.మీ ఏజన్సీ నిర్వహకులనే ఆడగండని బదులిస్తున్నారు. ఏజన్సీ నిర్వాహకుడు పై చర్యలు తీసుకొని జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి యూనిఫాం, చేతి గ్లవ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చెప్పే జీతం ఒకటి…..పీఎఫ్ పేరుతో కోత పెట్టి…అవి జమ చేయకుండా మముల్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.