టీ మీడియాడిసెంబర్ 1 వనపర్తి : యాసంగి లో వరి ధాన్యం కొనమని కొనుగోలు కేంద్రాలు ఉండవని కరాఖండిగా తేల్చి చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల ఓట్లు మీకు అవసరం లేదా అని టిపిసిసి మైనారిటీ కార్యదర్శి సజ్జాద్ అలీ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ను సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని కోటి ఎకరాలకు మాగాని అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటమూటలేనా అని ప్రశ్నించారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వీడాలి అన్నారు. తరతరాలుగా జాలువారిన పంట పొలాల్లో రైతులు పంటపొలాలను నమ్ముకొని వ్యవసాయం చేసి జీవనం కొనసాగించిన విషయం గుర్తించాలన్నారు. అన్నదాత ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు వారిని ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నదాతలు స్వేచ్ఛగా తమకి ఇష్టం వచ్చినట్లు పంటలను చేసుకునే వారని తెలిపారు.
ఈ విషయంలో ప్రభుత్వాలు రైతులకు ఆంక్షలు విధించడం బాధాకరమన్న వారికి లేదన్నారు. తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి రైతుల పట్ల ఆకర్షితులు తొలగించి వారు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.