గృహహింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలు

గృహహింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలు

0
TMedia (Telugu News) :

గృహహింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలు

– మంత్రి హ‌రీశ్‌రావు

టీ మీడియా, అక్టోబర్ 9, సిద్దిపేట : గృహ హింస బాధితుల కోసం భ‌రోసా, స‌ఖీ కేంద్రాల‌ను సిద్ధిపేట జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి మ‌రీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి- వెళ్ళుపల్లిలో నూత‌నంగా నిర్మించిన‌ ప్రభుత్వ వృద్దాశ్రమం, మహిళా ప్రాంగణం, జిల్లా మహిళా సమాఖ్య భవనాల‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా సిద్దిపేట జిల్లా మహిళా సమైక్య భవనాన్ని నిర్మించామ‌ని తెలిపారు. రూ. కోటితో మూడు ప్రాంగణాల‌నుక‌లిపి ప్ర‌హ‌రీ గోడ నిర్మించామ‌ని చెప్పారు. మరో రూ. కోటి పది లక్షల‌ తో సీసీ కెమెరాలు, ఫర్నిచర్ అందుబాటులోకి తెస్తామ‌న్నారు. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భరోసా, సఖి, ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్, బాల రక్ష భవన్ నిర్మించామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. శిశు గృహను కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ వృద్ధాశ్రమం, మహిళా ప్రాంగణం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను ఏర్పాటు చేశాం. వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు పట్టించుకోని వ‌యోవృద్ధులను తల్లిదండ్రులలాగ చూసుకుంటామ‌న్నారు. మహిళా ప్రాంగణంలో మహిళలకు వృత్తి శిక్షణ ఇస్తాం.

Also Read : వాషింగ్టన్‌లో భూకంపం

గృహ హింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలు, అనాథ‌ బాలల కోసం శిశు గృహ ఏర్పాటు చేశామ‌న్నారు. ఉద్యోగాలు చేసే మహిళల కోసం ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. అవసరమైన వారు ఉపయోగించుకునేలా అందరికీ వీటి గురించి తెల‌పాల‌ని హ‌రీశ్‌రావు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌ప‌ర్స‌న్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మహిళా సమాఖ్య సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube