టిటిడి పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంపు : టిటిడి ఛైర్మన్
-ముగిసిన పాలకమండలి సమావేశం..
-పలు కీలక నిర్ణయాలు
టీ మీడియా, అక్టోబర్ 9,తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి సమావేశం ముగిసింది. తిరుమలలోని అన్నమయ్య భవవ్‌లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. టిటిడి పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచాలని నిర్ణయించింది. 5 వేల మంది పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచనున్నారు. అలానే టిటిడి పరిధిలోని కార్పోరేషన్ లో విధులు నిర్వర్తిస్తూన్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా.. కార్పోరేషన్లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పోందితే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేలా.. కార్పోరేషన్ లో పని చేస్తూ ఈఏస్‌ఐ వర్తించని ఉద్యోగులుకు హేల్త్ స్కీం అందించేలా నిర్ణయం తీసున్నామన్నారు. ఇకపైన అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హౌమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నారాయణగిరి ఉద్యాణవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసేందుకు 18 కోట్లు కేటాయిచమని వెల్లడించారు.
Also Read : గృహహింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలు
అలానే ఆకాశ గంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు, తిరుపతి లోని చేర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డుని, వరహస్వామి అతిధి గహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మించనున్నట్లు అలానే గరుడా సర్కిల్ వద్ద రోడ్డు వెడల్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube