నేవీ సిబ్బందితో సల్మాన్‌ ఖాన్‌ ఆటా పాటా,వంట

నేవీ సిబ్బందితో సల్మాన్‌ ఖాన్‌ ఆటా పాటా,వంట

1
TMedia (Telugu News) :

నేవీ సిబ్బందితో సల్మాన్‌ ఖాన్‌ ఆటా పాటా-వంట

టీ మీడియా, ఆగస్ట్ 11, విశాఖపట్నం: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు మిన్నంటాయి. ఇళ్లపై తిరంగా జెండాలు ఎగురవేస్తున్నారు. వాహనాలకు కూడా మువ్వన్నెల జెండాను కట్టుకుని చాలా మంది మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌ హీర్‌ సల్మాన్‌ ఖాన్‌ షూటింగ్‌ గ్యాప్‌లో తనకు దొరికిన కొద్దిపాటి సమయాన్ని నేవీ సిబ్బందికి వెచ్చించారు. వారితో ఆడిపాడారు. వారితో కలిసి వంట చేశారు. మువ్వన్నెల జెండాను చేతబట్టుకుని నేవీ సిబ్బందితోపాటు వారి కుటుంబాలను ఉత్సాహపరిచారు. పలు సినిమాల షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌.. షూటింగ్‌ విరామాన్ని దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరుపుకునేందుకు కేటాయించారు.

 

Also Read : స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా వజ్రోత్సవ వేడుకలు

 

ప్రస్తుతం విశాఖలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న సల్మాన్‌ ఖాన్‌.. విరామం ప్రకటించగానే నేవీ సిబ్బందితో గడిపారు. త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇండియన్‌ నేవీ తూర్పు కమాండ్‌ స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో కలిసి ఆడిపాడారు. దాదాపు ఐదారు గంటలు నౌకాదళ సిబ్బంది, వారి కుటుంబాలతో కలిసి ఎంజాయ్‌ చేశారు. నేవీ క్యాప్‌ ధరించిన సల్మాన్‌ ఖాన్‌.. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని డ్యాన్సులు చేశారు. ఫుష్‌ అప్‌లు చేస్తూ నేవీ జవాన్లను ఉత్సాహపరిచారు. వారిని కూడా చేయాలంటూ పోటీ పెట్టారు. అనంతరం అక్కడే కిచెన్‌లో వంట చేశారు. తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని.. అంతే ఇష్టంగా కూడా తింటానంటూ చెప్తూ జవాన్లను నవ్వుల్లో ముంచెత్తారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ బిజీ నటుడు తమ వద్దకు వచ్చి టైమ్‌ కేటాయించి తమతో ఆడిపాడటం పట్ల నేవీ జవాన్లు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube