టీ మీడియా,డిసెంబర్ 21, గోదావరిఖని :
గోదావరిఖని లోని రమేష్ నగర్ లో గల మహాత్మ జ్యోతిరావు పూలే బిసి వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని మంగళవారం రోజు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ),ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు),సామాజిక కార్యకర్త తోట శ్రీనివాస్,ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర కన్వీనర్ శైలజ,సామాజిక కార్యకర్త తోట శ్రీనివాస్, డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ… నాలుగు వందల మంది విద్యార్థినిలు ఉంటున్న హాస్టల్లో కనీస వసతులు సౌకర్యాలు లేకపోవడం చాలా దుర్మార్గం అన్నారు. సింగరేణి ఎన్టిపిసి మున్సిపల్ అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు సమస్యలను తీసుకుపోయి పరిష్కరించడంలో యాజమాన్యం కూడా పూర్తిగా విఫలమైందని వారు మండిపడ్డారు.కాబట్టి విద్యార్థుల చదువు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధాన సమస్యగా ఉన్న హాస్టల్ పహరి గోడ పైన ముళ్ళ కంచె పెంచింగ్ ఏర్పాటు చేసే విధంగా మరియు సీసీ కెమెరాల ఏర్పాటు అదేవిధంగా నాలుగు వందల మంది విద్యార్థినిలకు సరిపడా స్నానపు గదులు, మూత్రశాలలు హాస్టల్ మరియు పాఠశాల ఆవరణలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకై,సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరిత సమస్య పరిష్కారానికై కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్ కుమార్,మల్లేష్ పాల్గొన్నారు.
