రాజు సంస్థానానికి

నిధులు కేటాయించాలి

0
TMedia (Telugu News) :

రాజు సంస్థానానికి నిధులు కేటాయించాలి

టీ మీడియా, మార్చి 2 ,వనపర్తి : ఈనెల 8వ తేదీన సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా అఖిలపక్షం తరపున సమస్యలతో స్వాగతం పలుకుతున్నాము. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అఖిలపక్షం తరఫున చెప్పే సమస్యలను దృష్టిలో పెట్టుకొని సీఎంకి విన్నవించి వాడిని పరిష్కార దిశగా ఆలోచించాలని కోరారు. ముఖ్యంగా పట్టణంలోని రోడ్డు వెడల్పు కార్యక్రమం చాలా గొప్పది కానీ నత్తనడకన నడుస్తున్నది. వాటికి నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలి నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి అలాగే వనపర్తి గుండెకాయ లాంటి రాజప్రసాదం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనం అయినటువంటి రాజాగారి బంగ్లా శిథిలావస్థకు చేరింది. నిధులు కేటాయించి మరమ్మతులు చేయించాలి అని కోరారు. మీరు రాజభవనాన్ని రక్షిస్తే ప్రజల్లో మీ మీద విశ్వాసం పెరుగుతుందని కోరారు. ముఖ్యమంత్రి రాజా గారి బంగ్లాను పరిశీలించి నిధులు కేటాయిస్తే భవిష్యత్తులో ఇది టూరిజం ప్లేస్ గా ఉపయోగపడుతుంది. 1932 తర్వాత వనపర్తి బస్ డిపో ఏర్పడిన నాటి నుండి ఏర్పడిన పాతబస్టాండ్ వినియోగంలోకి తెచ్చే అక్కడి ప్రజలు రోడ్డుపైన నిలబడకుండా ఉపయోగం లోకి తెస్తే బాగుంటుంది అని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, బిఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి, రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేష్ ,జయరాములు, షఫీ, రాములు, పాండుసాగర్, విష్ణుయాదవ్ ,రమణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube