-దుగినేపల్లిలో ఇంటింటికి కేసీఆర్- గ్రామ గ్రామానికి టీఆర్ఎస్ కార్యచరణ ప్రారంభం
– గ్రామాల్లో విస్తృత పర్యటన
టీ మీడియా,డిసెంబర్ 15,పినపాక:
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు అన్నారు.
బుధవారం పినపాక మండలం దుగినేపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ గుడి నుండి ఇంటింటికి- కేసీఆర్ గ్రామ గ్రామానికి టీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని తొలిరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ…
ప్రజల సమస్యలపై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం ధీమాగా ఉందని తెలిపారు.దుగినేపల్లి సమ్మక్క సారలమ్మ గుడికి లక్ష రూపాయలను రేగా విష్ణు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళం, ఎస్సీకాలనీలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
డబుల్బెడ్రూం ఇళ్ళను పరిశీలించారు.అదే విధంగా గుట్టమీద పూనెం కాంతమ్మకు రూ. 60,000 అందజేశారు.లంబాడీ తండాలో ప్రజలతో ముఖాముఖి అయ్యారు. అనంతరం టి.కొత్తగూడెంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.చేగర్శలలో రెండు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.
అన్ని గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించారు.
అనంతరం ఎల్చిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన తోకల మజునుకు రూ. 3 లక్షల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి,ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,సొసైటీ చైర్మన్ రవివర్మ,వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి,ముఖ్య నాయకులు కోలేటి భవానీ శంకర్, దాట్ల వాసుబాబు,బొలిశెట్టి నర్సింహారావు,ఉడుముల లక్ష్మిరెడ్డి,పోలిశెట్టి సత్తిబాబు,రాయల సత్యనారాయణ,వడ్లకొండ శ్రీను, డాక్టర్ శ్రీరామ్, దినసరపు శ్రీనివాసరెడ్డి, సాయిని సమ్మయ్య, కటకం గణేష్, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్లు,వార్డు సభ్యులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
