కార్మికులకు అండగా సాముల జైపాల్ రెడ్డి
టి మీడియా, ఆగష్టు , మేళ్ళ చెరువు:
ఆదివారం మేళ్లచెరువు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ సిబ్బంది కార్మికులకు స్వాముల జైపాల్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సాముల జైపాల్ రెడ్డి అండగా నిలిచారు.ఈసందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ .. పరిసరాలన్నీ తమ ఇంటి కంటే, తమ దేహం కంటే ఎక్కువగా పరిశుభ్రంగా ఉంచే గ్రామ సిబ్బంది కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.కరోనా సమయంలో ప్రపంచమంతా గజగజలాడుతూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంట్లోంచి బయటికి రాకుండా భయపడి దాక్కున్న సరే గ్రామ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పరిసరాలని శుభ్రంగా ఉంచారు. అలాంటి వాళ్లకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని గుర్తించక పోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.