జోరు గా మట్టి దందా
-నిరసనగా గ్రామస్థులు ఆందోళన
టీ మీడియా,మార్చి 10,ముదిగొండ:
* ఖమ్మం జిల్లాముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో జోరుగా మట్టి దందా సాగిస్తున్న ఓ కాంట్రాక్టర్… మట్టి క్వారీల వద్ద ఆందోళన చేపట్టిన అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు*ప్రభుత్వ భూముల్లో న తవ్వకాలు చేస్తున్నారు.పగలు, రాత్రి అనే తేడా లేకుండా జోరుగా సాగున్న మట్టతరలింపు.కొనసాగుతున్న దన్నారుఇదేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్న రని అన్నారు.
అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి దందా కొనసాగుతోందనిఅఖిల పక్షం నాయకులు, గ్రామస్థులు ఆరోపించారు.అదిక లోడుతో మట్టి తరలింపు, నేర్రలు భారి అధ్వాన్నంగా తయారైన రోడ్లు తయారు అయింది అన్నారు. మట్టి దందాకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ లైసెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అఖిలపక్షం నాయకులు. మట్టి తరలింపును నిలిపివేయాలని, మైనింగ్ అనుమతిని రద్దు చేయాలని అఖిల పక్షం నాయకులు గ్రామస్తుల డిమాండ్ చేసారు.అక్రమ మట్టి తోలకాలను నిలిపివేసి మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు.