
ఆగని ఇసుక అక్రమ రవాణా
టీ మీడియా, జనవరి 07, ధర్మపురి:జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక గోదావరి నదిలో ఇసుక అక్రమంగా తీసి పలుచోట్ల నిలువ ఉంచి హ ఇసుకను ఉమ్మడి జిల్లా స్థాయిలో విక్రయిస్తున్న అడిగే నాధుడే లేడు ప్రస్తుతం వివరాలలోకి వెళితే ధర్మపురి గోదావరి నదిలో గల స్థానిక హనుమాన్ గడ్డ మఠం గడ్డ సత్యవతి గుండం దమ్మన్నపేట రాజారాం తదితర ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెవెన్యూ మునిసిపల్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు నిన్న మొన్నటి వరకు నదిలో నీరు నిలువ ఉండడంతో ఇసుక తీయడం వీలుకాదు ప్రస్తుతం నదిలో నీటి నిలువ తగ్గడంతో ఇసుక మాఫియా కన్ను పడింది ఎల్లంపల్లి డ్యామ్ నుండి దమ్మన్నపేట గ్రామం వరకు సుమారు ముప్పై కిలో మీటర్ల మేర బ్యాక్ వాటర్ నిలువ ఉంటుంది ప్రస్తుతం ధర్మపురి మండలం లోని అరపెళ్లి గ్రామం నుండి దమ్మన్నపేట ధర్మపురి వరకు పది కిలోమీటర్ల మేర నది నీటి మట్టం తగ్గడంతో నదిలో యథేచ్ఛగా ఇసుకను తోడుతున్నారు రెవెన్యూ మునిసిపల్ మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు అని పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సేకరించిన ఇసుకను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేరవేస్తున్నారు ట్రిప్పుకు నాలుగు వేల నుండి ఐదు వేలకు అమ్ముతున్నారు టీ మీడియాకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నరు అని స్థానిక యూవ నాయకుడు టీ మీడియాకు సమాచారం అందించడంతో అక్కడకు వెళ్లి చూస్తే సుమారు యాభైకీ పైగా ట్రాక్టర్ లలో ఇసుకను సేకరిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నది తిరవాసులు ఆయా గ్రామాల ప్రజలు టీ మీడియా వేదికగా జరుగుతున్న ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పలువురు ప్రముఖులు ప్రతిపక్ష నేతలు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube