*డస్ట్‌ పేరుతో ఇసుక రవాణా*

టీ మీడియా,మార్చి 5

2
TMedia (Telugu News) :

*డస్ట్‌ పేరుతో ఇసుక రవాణా*

-సీజ్‌ ఇసుక పేరుతో వే బిల్లులు సృష్టించి తరలింపు*

-ప్రభుత్వ పనులకు అనుమతుల పేరుతో దందా*

-ఎద్దుల బండ్లలో తీసుకెళ్లి డంప్‌ చేసి విక్రయాలు*

టీ మీడియా,మార్చి 5 , జోగుళాంబ గద్వాల :జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కొత్తపుంతలు తొక్కుతోంది. జిల్లాలో తుంగభద్ర నది ఇసుకకు ప్రధాన ఆదెరువు. అయితే ప్రస్తుతం నదిలో నీరు ఎక్కువగా ఉండటంతో రీచ్‌లకు అనుమతులు ఇచ్చి, ఇసుకను తరలించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జిల్లా అవసరాలకు ఇబ్బందులు తలెత్తడంతో వ్యాపారులు కాళేశ్వరం నుంచి ఇసుకను కొనుగోలు చేసి, తెచ్చి విక్రయించారు.

 

   also read:కారణం లేకుండా టీచర్లు నన్ను కొట్టారు

 

అక్కడి నుంచి తేవడం వల్ల ధర ఎక్కువ కావడంతో భవన నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ పనుల కోసం అక్కడక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా, ఇదే అదునుగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయిజ మండలం పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, రాజోలి మండలం వేణిసోంపురం వద్ద ఇసుక తవ్వకాలు మొన్నటివరకు నిరాటంకంగా జరిగాయి. అయిజ మునిసిపాలిటీలో అభివృద్ధి పనుల పేరుతో తవ్వకాలు జరిపి, ఇసుకను పట్టణంలోని పలుచోట్ల డంప్‌ చేసి, తర్వాత అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

 

  also read: కేసీఆర్ ని కలసి విజ్ఞప్తి చేయాల బసవతారకం
డస్ట్‌ పేరుతోజోగుళాంబ గద్వాల జిల్లా ఇప్పటికే ఇసుక, మట్టి అక్రమ రవాణాకు పెట్టింది పేరు. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపుమీద ఉండటంతో నూతనంగా ఏర్పాటు చేయబోయే వెంచర్లకు మట్టిని అక్రమంగా తరలించడంతో పాటు, నిర్మాణ రంగం వృద్ధిలో ఉండటంతో బహుళ అంతస్థుల భవనాలకు ఇసుకను కూడా రవాణా చేస్తున్నారు. అయితే ఇసుక రవాణాకు ప్రస్తుతం అనుమతులు లేకపోవడంతో కొందరు అక్రమార్కులు అనుమానం రాకుండా డస్ట్‌ పేరుతో ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ బాడీ లెవల్‌కు ఇసుకను నింపి, దానిపైన ఒక ఇంచు మేర డస్ట్‌ను నింపి తరలిస్తున్నారు. దీంతో ఎవరికీ అనుమానం రావడం లేదు. అధికారులకు, పోలీసులకు ఈ దందా తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతుల పేరుతో డంప్‌ చేసిన ఇసుకను తరలించడానికి ఇసుకాసురులు ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే గద్వాల మండలం గుర్రంగడ్డ వద్ద కృష్ణానదిలో ఇసుకను కేవలం ఎద్దుల బండ్ల ద్వారా రవాణా చేస్తున్నారు. తక్కువ మొత్తంలో కావడంతో వారిపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అలా ఎద్దుల బండ్లతో రవాణా చేసిన ఇసుకను ఎర్రవెల్లి చౌరస్తాలో ఓచోట డంప్‌ చేసి, ట్రాక్టర్లు లేదా టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

  also read:6న సీఎల్పీ సమావేశం

 

*సీజ్‌ ఇసుక ఎక్కడిది*?

వనపర్తి జిల్లాలో శ్యాండ్‌ ట్యాక్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇసుక సీజ్‌ చేసిన దాఖలాలు చాలా తక్కువ. అయితే ఇటీవలి కాలంలో సీజ్‌ చేసిన ఇసుక పేరుతో ఆయా మండలాల రెవె న్యూ అధికారులు వే బిల్లులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదాహ రణకు పెబ్బేరు మం డలం రాంపూర్‌ వద్ద కృష్ణానది నుంచి ఈ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. వనపర్తి జిల్లాతో పాటు జోగుళాంబ గద్వాల జిల్లాకు కూడా ఇక్కడి నుంచే నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం. ఇసుకను అనుమతులు లేకుండా తరలించినప్పుడు అధికారులు ఆ డంపులను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేస్తే, దాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం కోసం వే బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇసుక సీజ్‌ చేయకుండా, తవ్వకాలకు అనుమతులు లేకుండా వే బిల్లులు ఇవ్వడానికి అధికారులకు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తుంగభద్ర నుంచి డంప్‌ చేసిన ఇసుకను తరలించిన సమయంలో కూడా ఇలాగే రాజోలి రెవెన్యూ అధికారుల పేరుతో నకిలీ వే బిల్లులు సృష్టించారు.

   also read:ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు

ఈ క్రమంలో అక్కడి రెవెన్యూ అధికారులను బదిలీ కూడా చేశారు. ఇటీవల కొత్తకోట నుంచి సీజ్‌ పేరుతో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను కూడా ఇటిక్యాల మండలంలో పోలీసులు పట్టుకున్నారు. ఒక జిల్లాలో సీజ్‌ చేసిన ఇసుక ఆ జిల్లా ప్రభుత్వ పనులకే వాడాల్సి ఉండగా, ఇతర జిల్లాలకు తరలించడం గమనార్హం. మరోవైపు ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకపోయినా దందాను నిరాటకంగా కొనసాగిస్తున్నారు. అలాగే నారాయణపేట జిల్లా మక్తల్‌ నుంచి కూడా రాత్రి వేళల్లో గద్వాలకు చెందిన ఓ వ్యక్తి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు కర్ణాటక నుంచి కేటీ దొడ్డి మండలం మీదుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సోమవారం రాత్రి రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube