
-50 నుండి 60 ట్రాక్టర్ల తో రైయి … రైయి … రైయి
– డ్రైవర్ల గా చిన్నారులు
టీ మీడియా, డిసెంబర్ 8 మణుగూరు:మా వెనక ఎవరు ఉన్నారో తెలుసా .?నాయకులు, సైతం ఈ దందా లో ప్రముఖ పాత్ర దారుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం , చిన రావిగూడెం గోదావరి పరివాహక ప్రాంతంలో అధికారికంగా సోసైటి ఇసుక ర్యాంపులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ప్రజల సౌకార్యార్థం ఇసుక సరఫరా చేస్తుంది. కానీ కొందరు ఇసుక మాఫియా కేటుగాళ్లు దోడ్డి దారిన ఇసుక దందా చేస్తూ లక్షలు గడిపేస్తున్నారు.నిత్యం 50 నుండి 60 ట్రాక్టర్ లతో రైయి .. రైయి .. అంటూ మోతలతో హోరెతిస్తూ ప్రజలను నిద్ర పోనివకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక అవసరాన్ని బట్టి 1500 నుండి 3000 రూపాల వరకు అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నారు . ఈ ఇసుక దందా లో సర్పంచ్ , అధికార పార్టీ కి చెందిన కొందరు నేతలు, సంఘం లో పెద్ద మనుషులు గా చాలమని అవుతున్న వారు , ఒక వ్యక్తి పత్రిక విలేకరి ని చెప్పుకుంటూ ఈ దందా చేస్తూ ఉండటం కోసమేరుపు .
తహశీల్దార్ వివరణ …
మణుగూరు తహశీల్దార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ … ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ అధికారులు గతం లో కూడా చిన రావిగూడెం గోదావరి లోకి ట్రాక్టర్లు వెళ్లు కుండా కందకాలు తవ్విOచాము అని అక్రమార్కులు వాటిని పూడ్చేసి ఇసుక దందా చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు ట్రాక్టర్ల ని పట్టుకొని బైండోవర్ చేస్తున్నా కానీ వారి పద్దతి మారడం లేదని చిన్న పిల్లలు డ్రైవర్ గా వున్నారని, ఈ విషయం ని లేబర్ యాక్ట్ ఇన్ స్పెక్టర్ , ఆర్టి ఏ, అధికారులకు సైతం తెలియజేస్తాం అని అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube