వాగులో జేసిబి తో ఇసుక తరలింపు
– అధికార పార్టీ నేతలకు అనుమతి అవసరం లేదా.?
టీ మీడియా, జనవరి 31, పెద్దపల్లి బ్యూరో : శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పరిధిలోని హుస్సేన్ మియా వాగులో నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్ట్రావేటర్తో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పట్టపగలే ఇసుక తరలింపు చేస్తూ ఉండడం విడ్డూరంగా ఉంది. సామాన్య ప్రజలు తమ ఇంటి నిర్మాణానికి, లేదా చిన షెడ్డు వేసుకోవడానికి ఇసుక కావాలి అంటే ఎంతమంది అధికారుల పర్మిషన్ కావాలి ఒక సామాన్య మనిషికి ప్రతిదానికి ఆటంకాలు ఉంటాయి కానీ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు నిబంధనలు వర్తించవ అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇసుకకు డబ్బులు చెల్లిస్తుంది.
Also Read : సెజ్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి
అధికారుల పర్మిషన్ ఉన్నప్పటికీ కొందరు నిరుద్యోగులకు ఉపాధి కలగాకుండా ఎక్స్ట్రా వెయిటర్ తో తరలించడం ఏంటా అని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు పర్మిషన్ జెసిబి ద్వారా ఇసుక తరలింపు చెయ్యమని ఇచ్చారా అని గ్రామ ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube