ఇసుక మాఫియాదే పై చెయ్యి

పాలనా సహకారం

0
TMedia (Telugu News) :

ఇసుక మాఫియాదే పై చెయ్యి

పాలనా సహకారం

టీ మీడియా ,ఏప్రిల్ 24 ,ములుగు: జిల్లా లోని ఇసుక మాఫియా అక్రమంగా రాత్రికిరాత్రే లారీలను గుట్టుచప్పుడు కాకుండా తరలించి అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలోని ఇసుక క్వారీ లో అక్రమంగా జీరో ఇసుక లారీలను తరలిస్తున్న సమాచారం అందుకున్న గ్రామస్తులు కాంట్రాక్టర్లతో శుక్రవారం రాత్రి వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం
ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా సాగుతున్న అనేక అక్రమాలపై అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న వైఖరి అనుమానాలకు తావిస్తోంది.

జిల్లాలో కేవలం అడ్డదారి వ్యవహారాలను ప్రోత్సహిస్తున్న అధికారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో ఇక్కడ అ అక్రమార్కుల రాజ్యమే కొనసాగుతోంది.

 

Also Read : రైల్వే స్టేషన్ ను సందర్శించిన జిఎం

జిల్లాలోని వెంకటాపురం .వాజేడు .ఏటూరునాగారం. మంగపేట. పరిధిలో జరుగుతున్న ఇసుక తవ్వకాల వ్యవహారం లో చోటు చేసుకుంటున్న అడ్డదారి ఘటనలు జిల్లా స్థాయి అధికారుల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఈ ములుగు నియోజకవర్గాల్లో సాగుతున్న ఇసుక దోపిడిని పరిశీలిస్తే జిల్లాలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నుండి ఇసుక అడ్డగోలుగా తరలిస్తున్నా జిల్లావ్యాప్తంగా ఎక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితులు లేవు. ఆదివాసీలకు ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకతను జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విస్మరించడంతో ఇక్కడ బినామీ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం గానే ఇసుక తవ్వకాలు సాగిపోతున్నాయి. గోదారిలోకి భారీ వాహనాలను తీసుకెళ్లి యంత్రాల ద్వారా ఇసుకను ఒడ్డుకు చేరుస్తూ గిరిజనుల ఉపాధిని హరిస్తున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అవినీతి యంత్రాంగాన్ని ప్రశ్నించే వారే లేకుండాపోయారు. జిల్లా వ్యాప్తంగా ఓవర్ లోడింగ్ ద్వారా ఇసుకను తరలిస్తున్న పరిస్థితిని అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం మాఫియా ఇస్తున్న మామూళ్ల మత్తులో అక్రమాలకు అండగా నిలుస్తున్నారు.
జిల్లాలో ఉన్నతమైన స్థానంలో ఉన్న పలువురు అధికారులు ఉన్నప్పటికీ అక్రమార్కులే ఇక్కడపై చేయి సాధిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న అవినీతి అధికారుల సహకారంతో ఇసుక మాఫియా చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలను ఉన్నతాధికారులు సైతం నియంత్రించే లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది . ఇసుక దందా పై పత్రికల్లో సోషల్ మీడియా ద్వారా అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు కనీసం స్పందిస్తున్న పరిస్థితి లేదు నిజాయితీ ముసుగును కప్పుకున్న కొందరు ఉన్నతాధికారులు లోపాయికారి ఒప్పందం రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇసుక మాఫియా సలాం కొడుతుంది పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది.

Also Read : ఎన్ఆర్ఈజీఎస్ వేతనం 257పడేలా పనిచేయాలి

ములుగు
జిల్లాలోని వాజేడు. వెంకటాపురం .మంగపేట ఎటురూనాగారం. సాగుతున్న ఇసుక దందా పై రాజకీయ పక్షాలు ఆదివాసి సంఘాలు సైతం నోరు మెదపకపోవడం వెనక ఆర్థికపరమైన లావాదేవీలు చోటుచేసుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దొడ్డిదారి వ్యవహారాలను అడ్డుకోవలసిన గిరిజన సంఘాలు వామపక్ష పార్టీలు మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉండటం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమాలు వెనక అధికార పార్టీ నేతలతో పాటు కొన్ని ప్రతి పక్షాలు సైతం లోపాయికారి భాగస్వామ్యంతో పని చేస్తుండడంతో అడ్డదారి బాగోతం అడ్డూ అదుపు లేకుండా సాగిపోతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube