అంతా అక్రమం

కోరుమిల్లి తాతపూడి లలో అనధికారిక ఇసుక తవ్వకాలు

1
TMedia (Telugu News) :

అంతా అక్రమం

-కోరుమిల్లి తాతపూడి లలో అనధికారిక ఇసుక తవ్వకాలు

వందలాది లారీలతో అక్రమ తరలింపు

-అడ్డుకున్న ఎమ్మెల్యే వేగుళ్ల

నిర్వాహకుల పై చర్యలు కోరుతూ లిఖిత పూర్వక పిర్యాదు
టీ మీడియా, ఏప్రిల్ 14,మండపేట: కపీలేశ్వరపురం మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు మీడియాను వెంటబెట్టుకుని శ్రీరామ్ పురం లోజరుగుతున్న ఇసుక రీచ్ లకు చేరుకున్న ఆయన అక్కడ ఉన్న లారీలను, జేసీబీ లను నిలువరించారు. కాగా అక్కడ విధుల్లో ఉన్న వారిని అనుమతులు చూపించమని కోరగా వారు నిమాషానికో సమాధానం చెబుతూ నీళ్లు నమిలారు. దీంతో అక్కడి నుండే ఎమ్మెల్యే వేగుళ్ల తహసీల్దార్, ఎస్.ఐ లను ఘటనా స్థలికి రావాల్సిందిగా ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ ను వివరణ కోరగా ఇక్కడ ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. దీనిపై తహసీల్దార్, అంగర ఎస్.ఐ లకు వేగుళ్ల లిఖిత పూర్వక పిర్యాదు ఇచ్చి చట్ట రీత్యా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున 131 లారీల ఇసుక తరలించినట్లు మీడియా సాక్షిగా ఇక్కడి నిర్వహకులే స్వయంగా తెలియజేయడం జరిగిందన్నారు.

Also Read : ప్రాణహిత పుష్కారాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఆ లెక్కన చూసుకుంటే ఒక ఇసుక ర్యాంపు నుండి సుమారు 12 లక్షలు విలువ చేసే ఈ డబ్బు అక్రమంగా చేతులు మారిందన్నారు. రెండు ర్యాంపులు కలుపుకుంటే రోజుకు 20 లక్షలు పైగా ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బు వైసీపీ నాయకులు జేబుల్లోకి వెళుతుందన్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ దందాలో ఎన్ని కోట్లు మారి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. స్థానిక వైసీపీ నాయకుల కను సన్నల్లోనే ఈ దందా అంతా సాగుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇది వైసీపీ నాయకుల అరాచకాలకు నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి దోషులపై చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలు ప్రకారం ర్యాంపు నిర్వహణ సాగేలా చర్యలు తీసుకుని అక్కడ ర్యాంపులలో పని చేసే పేద ప్రజలకు ఉపాధి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube