టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

0
TMedia (Telugu News) :

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

టీ మీడియా, జనవరి 31, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) విజిలెన్స్ విభాగ ఎస్పీగా ఐపీఎస్ అధికారి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మంగ‌ళ‌వారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్‌లోని తన ఛాంబర్‌లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ములుగు ఎస్పీగా ఉన్న ఆయనను టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా ప్రభుత్వం ఇటీవల నియమించింది. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌కు సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ అభివృద్ధి కోసం మంచి ఐపీఎస్ అధికారిని నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. స్వయంగా డాక్టర్ అయిన సంగ్రామ్ సింగ్ సేవలను తార్నాక ఆస్పత్రిలో సౌకర్యాలను మరింతగా మెరుగుపరచడానికి, సిబ్బంది సంక్షేమానికి వినియోగించుకుంటామని సజ్జనార్ తెలిపారు. పోలీసింగ్ లాగానే ఆర్టీసీ కూడా ప్రజా సేవే అని గుర్తు చేశారు. ములుగు, భూపాలపల్లి ఎస్పీగా ఉన్నప్పుడు ఆదివాసీలకు సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ చేసిన వైద్య సేవలను మెచ్చుకున్నారు. మేడారం జాతర సమయంలో పోలీస్ శాఖకు టీఎస్ఆర్టీసీ పూర్తిగా సహకరించిందిదని, దాని వల్ల అతి పెద్ద గిరిజన జాతర విజయవంతంగా జరిగిందని గుర్తు చేశారు.

Also Read : వాగులో జేసిబి తో ఇసుక తరలింపు

త్వరలోనే సంస్థకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని, సంస్థ వృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కి సూచించారు. టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా తనను నియమించిందుకు ఈ సందర్బంగా ప్రభుత్వానికి సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ వృద్దికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆర్టీసీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube