ఘనంగా సర్ధార్ జలగం జయంతి వేడుకలు- కాసర చందు
టి మీడియా, మే 5,వేంసూరు: మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సర్ధార్ శ్రిజలగం వెంగళరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంగళరావు జయంతి వేడుకలు వాడ వాడలా, గ్రామ గ్రామాన, ఘనంగా జరిగాయి అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్ర శేఖర్ రెడ్డి అలియాస్ చందు తెలిపారు.
ఈసందర్భంగా చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మొట్ట మొదటి సారిగా రాజకీయంలో తొలి అడుగు సత్తుపల్లి నియోజక వర్గం నుండి ప్రారంభ మయిందని , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా , కేంద్ర హోం మంత్రి గా పని చేసి, రాష్ట్రానికే కాదు దేశానికే ఎనలేని సేవలు అందించారని, రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, రాష్ట్ర మిగులు ఆదాయాన్ని చూపించిన ఏకైక ముఖ్యమంత్రి సర్ధార్ జలగం వెంగళరావు అని వారి యొక్క సేవలు కొనియాడారు.
Also Read : మావోల కాల్పుల్లో జవాన్ మృతి
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుచ్చకాయలు సోమిరెడ్డి, యస్సీ సెల్ అధ్యక్షులుకోతమర్తి సురేష్, యూత్ ప్రధాన కార్యదర్శి మధు, అడసర్ల పాడు సర్పంచ్ ప్రేమలత భూచ్చాలు, యూత్ అధ్యక్షులు కనిషెట్టి వేణు,బింగు మల్లేశ్వర రావు, మండల సీనియర్ నాయకులు ఒగ్గు సత్యన్నారాయణ రెడ్డి, జామ్ముల సత్యం, లక్ష్మారెడ్డి, తుంబురు విశ్వనాథం, రావుల వేంకటేశ్వర రావు, వెంశూరు గ్రామకమిటి అద్యక్షులు కిన్నెర లాజార్, బి సి సెల్ అధ్యక్షులు కోట సత్యన్నారాయణ, మరియు నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube