ఘనంగా భారత ఉక్కుమనిషి జయంతి వేడుకలు
– జిల్లా ఎస్పీ రక్షిత కె.మూర్తి
టీ మీడియా, అక్టోబర్ 31, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో, కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవం. భారతదేశ ఐక్యత సమగ్రత భద్రతను కాపాడుతానని జిల్లావ్యాప్తంగా ప్రతిజ్ఞ చేసిన సిబ్బంది.జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నందు నివాళులర్పించిన పోలీసు అధికారులు సిబ్బంది.మంగళవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, ఆధ్వర్యంలో భారతదేశపు మొదటి హోం మంత్రి ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పూలతో సత్కరించి జాతీయ ఐక్యత దినోత్సవం (ఏక్తా దివస్) గా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్రానంతన ఏకీకృత దేశంగా రూపొందించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అనిర్వచనీయమైనదని కొనియాడారు. భారతదేశ సార్వభౌమత్యం ఐక్యతను కాపాడే క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనను భారతదేశపు ఉక్కుమనిషిగా నిలిపాయని తెలిపారు. అసమాన పోరాట ప్రతిమ ఉన్న స్వతంత్ర భారత యోధుడిగానే కాకుండా భారత దేశంలోని మొదటి హోం మంత్రిగా పనిచేసే స్వతంత్ర భారత దేశానికి సేవలందించారు. దేశంలోని అనేక సమస్యలను తనదైన పద్ధతిలో పరిష్కరించిన పటేల్ ఐక్యత భావనను ప్రతీకగా నిలిచారని ఇటువంటి మహనీయులను మనమంతా ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో, కార్యాలయాల్లో ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞను చేశారు. అందులో భాగంగానే పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఐక్యత దినోత్సవం ప్రతిజ్ఞను రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చదవగా జిల్లా ముఖ్య కార్యాలయ సిబ్బంది , రిజర్వ్ సిబ్బంది పోలీసు సిబ్బంది పాల్గొని అనుసరించారు.
Also Read : కొడంగల్ లో ఓడిన రేవంత్.. కామారెడ్డిలో గెలుస్తారా..?
ఈ ప్రతిజ్ఞలో భారత దేశ ఐక్యత సమగ్రత భద్రతను కాపాడుతానని సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనీయత చర్యల వల్ల సాధ్యమైన నా దేశాన్ని ఏకీకృతం చేయాలనే స్ఫూర్తితో నేను ప్రతిజ్ఞ చేస్తున్నానని, భారతదేశం యొక్క అంతర్గత భద్రతను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటానని గంభీరంగా నిర్ణయించుకుంటున్నాను అని ప్రతిజ్ఞ ఈ కార్యక్రమంలో ఏవో , తాజ్ ద్దీన్, ఎస్బి ఇస్పెక్టర్ మధుసూదన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీస్ కార్యాలయం సూపరిండెంట్లు ఇంతియాజ్, రాజ వర్ధన్ ఎస్పీ సిసి మధు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube