బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎంపీపీ

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎంపీపీ

0
TMedia (Telugu News) :

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన -ఎంపీపీ జక్కుల ముత్తయ్య

టీ మీడియా సెప్టెంబర్ 24ముత్తారం:

ముత్తారం మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మార్వో పద్మావతి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ జక్కుల ముత్తయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి, రైతుబంధు సమన్యాయ సమితి అధ్యక్షులు అత్తే చంద్రమౌళి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నూనె కుమార్ తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పోతి పెద్ది కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి లో భాగమైన బతుకమ్మ ను ఆడబిడ్డలు ఆటపాటలతో జరుపుకోవడం మన సంప్రదాయానికి ప్రతీక అని పువ్వులు వేరు వేరు అయినా అన్ని కలిస్తేనే బతుకమ్మ తయారు అవుతుందని,మనం కూడా అందరం కలిసి ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించారని, బతుకమ్మ అంటేనే గౌరమ్మ గౌరమ్మ అంటే ప్రకృతికి ప్రతిరూపమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు శ్యామల- సదానందం, రామగాళ్ల పోచమ్మ -మధుకర్ సర్పంచులు వేల్పూరి సంపత్ రావు, నేతేట్ల మహేందర్,సతీష్,సుగుణ- శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి పెయ్యాల కుమార్, ముత్తారం గ్రామ యూత్ ప్రెసిడెంట్ రాగుల సతీష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆలోవోజు రవీందర్, కో అప్షన్ మెంబెర్ హకిమ్ టిఆర్ఎస్ పార్టీ సెకండ్ వార్డ్ మెంబర్ సంకె కుమార్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆర్ ఐ రాజి రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మదన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube