ఆశ్రమ పాఠశాలను సందర్శించిన సర్పంచ్ కొర్శా నర్సింహమూర్తి ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని కలిగి ఉండాలి

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 28 వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని కలిగి ఉండాలని సర్పంచు కొర్శా నర్సింహమూర్తి పిల్లలకి తెలియజేశారు. మంగళవారం స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలని ఆయన సందర్శించి పిల్లలతో విద్యాపరమైన పరస్పర భావాలను పాలు పంచుకోవడం జరిగింది. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి ప్రశ్నించడం నేర్చుకోవాలని అన్నారు. తమ సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవలని అన్నారు. ఉపాధ్యాయుల నుండి ప్రతి రోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. విద్యతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. ప్రజలు ప్రభుత్వానికి పన్ను కట్టడం వల్లనే ఆ పన్నులతో ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని తెలియ జేశారు. బాగా చదివి పన్నులు కట్టి చదివించిన సమాజానికి సేవ చేయాలన్నారు. నైతిక విలువలు కలిగి ఉండాలని , ఉద్యోగం వచ్చిన తర్వాత పన్నులు కట్టి చదివించిన ప్రజల దెగ్గర లంచాలు తీసుకొని పని చేయొద్దని పిల్లల కి తెలియజేశారు. పిల్లలు సర్పంచు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పడం జరిగింది.

ప్రధాన ఉపాధ్యాయులు సపక నాగరాజు తోటి ఉపాధ్యాయుల చేత సమర్ధవంతంగా విద్యా బోధన చెపిస్తున్నారని , ఉపాధ్యాయుల ,విద్యార్థుల హాజరు శాతం బాగుందన్నారు. సర్పంచ్ నర్సింహమూర్తి ఉపాధ్యాయులు ,పిల్లల తో కలిసి మధ్యాహ్నం భోజనం చేయడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయుడు సపక నాగరాజు పాఠశాలను సమర్ధవంతంగా నిర్వర్తించు తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube